హైదరాబాద్: పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించే ఫీజు రీయింబర్సుమెంటు పథకాన్ని సాధించుకోవడానికి విద్యార్థులే ఉద్యమించాలని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి మంగళవారం పిలుపు ఇచ్చారు. ఎన్‌ఎస్‌యూఐ ముఖ్య నేతలతో గాంధీభవన్‌లో ఉత్తమ్‌కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. రీయింబర్సుమెంటు అందకపోవడంతో నష్టపోతున్న విద్యార్థులను అందరినీ కలిసి దరఖాస్తులను తీసుకోవాలని సూచించారు. ప్రతీ విద్యార్థి నుంచి తీసుకున్న దరఖాస్తును ప్రభుత్వానికి అందించాల్సి ఉందన్నారు.