
ఒబేసిటి (స్థూలకాయం)
నేటి సమాజంలో స్థూలకాయం అన్నది ఒక ప్రధాన సమస్యగా కన్పిస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లలలో కూడా ఇది ఒక ప్రధాన సమస్యగా మారింది. ప్రతి పదిమందిలో, ముగ్గురు స్థూలకాయంతో బాధపడుతున్నారు. ఆయుర్వేదంలో దీనిని స్థౌల్యం అని చెప్పబడింది. స్థూలకాయం అన్నది ఒక వ్యాధి కాకున్నా అనేక వ్యాధులకు దారి తీయడానికి మార్గంగా చెప్పబడింది.
కారణాలు:
అధికంగా ఆహారం తీసుకోవడం.
జంక్ ఫుడ్ లాంటిది ఎక్కువ తీసుకోవడం
శారీరక శ్రమ లేకపోవడం
మానసిక ఒత్తిడి ఎక్కువ ఉండడం
స్త్రీలలో హార్మోనల్ సమతుల్యత దెబ్బతినడం
హైపో థైరాయిడిజమ్
కొన్ని రకాల మందులు ఎక్కువగా తీసుకోవడం
వంశపారంపర్యంగా కూడా స్థూలకాయం రావడానికి అవకాశాలున్నాయి.
ప్రతికూలతలు:
స్థూలకాయంను నిర్లక్ష్యం చేయడం వల్ల అది కొలెస్ట్రాల్ లెవెల్స్ పెంచడంతో పాటు గుండె సంబంధ వ్యాధులకు దారితీయవచ్చు.
మధుమేహం వచ్చే అవకాశముంది.
స్థూలకాయం వల్ల ఆర్థరైటీస్, శ్వాస సంబంధ వ్యాధులు రావచ్చు.
నిర్ధారణ:
ఒక వ్యక్తి స్థూలకాయంతో బాధపడుతున్నాడని నిర్ధారించడానికి బాడీ మాస్ ఇండెక్స్ (బి.యం.ఐ) సూచికగా పనిసొస్తుంది.
ఆ.M.I= Wt in Kgs Ht in M2
బి.యం.ఐ సూచికలో పురుషులలో 17-27, స్త్రీలలో 17-25 (నార్మల్ అని చెప్పబడింది).
27-32---------అధిక బరువు
32 కన్న ఎక్కువ ------ స్థూలకాయం
17 కన్న తక్కువ ----- కృశత్వం
చికిత్స: ఆయుర్వేదంలో స్థూలకాయాన్ని మేదోరోగంగా పరిగణించడం జరిగింది.
దీనికి శోధన, శమన అని రెండు రకాల చికిత్స చెప్పడం జరిగింది. శోధన చికిత్సలో కషాయవస్తి (నిరూహవస్తి) ప్రధాన చికిత్సగా చెప్పబడింది. దీనితో పాటు ఉద్వర్తనం, స్వేదనం లాంటి చికిత్సలు ఉపయోగకరంగా ఉంటాయి. ఇక శమన చికిత్సలో నాల్గవ ధాతువైన మేదోధాతువును కరిగించుటకు కొన్ని ప్రత్యేకమైన ఔషధాలు ఉన్నాయి. అలాగే ప్రతి వ్యక్తి కూడా వారి వ్యాయామ శక్తిని అనుసరించి శారీరక వ్యాయామం, జీర్ణశక్తిని అనుసరించి ఆహారం తీసుకోవడం వల్ల స్థూలకాయం రాకుండా కాపాడుకోగల్గుతారు.