ఓయూ సైన్స్ కళాశాలలో ఎమ్మెస్సీ చేసి బేసిక్ సైన్స్ రీసెర్చ్ (బీఎస్‌ఆర్) ఫెలోగా పరిశోధన చేస్తున్న సిరికొండ శ్రీకాంత్ (33) గుండెపోటుతో చనిపోయాడు.
హైదరాబాద్: ఓయూ సైన్స్ కళాశాలలో ఎమ్మెస్సీ చేసి బేసిక్ సైన్స్ రీసెర్చ్ (బీఎస్‌ఆర్) ఫెలోగా పరిశోధన చేస్తున్న సిరికొండ శ్రీకాంత్ (33) గుండెపోటుతో చనిపోయాడు. ఓయూ ఇన్‌స్పెక్టర్ అశోక్‌రెడ్డి కథనం ప్రకారం... ఖమ్మం జిల్లా వైరా మండలం గుబ్బగుర్తి గ్రామానికి చెందిన సిరికొండ అప్పయ్యచారి కుమారుడైన శ్రీకాంత్ గురువారం రాత్రి 12 గంటలకు పని ముగించుకొని తిరిగి బైక్ పై అంబర్‌పేట్లో గల తన రూంకు వెళ్తుండగా క్యాంపస్‌లోని ఇంజినీరింగ్ కళాశాల వద్ద గుండెపోటు వచ్చింది. బాధతో బైక్‌పై నుంచి కిందపడిపోయిన అతడిని అక్కడే ఉన్న కొందరు 108లో ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాగా ఆరు నెలల క్రితమే శ్రీకాంత్‌కు నల్లగొండ జిల్లా యువతితో వివాహం అయిందని స్నేహితులు తెలిపారు.