హైదరాబాద్ : ఓయూసెట్-2016 నోటిఫికేషన్‌ను ఓయూ పీజీ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ గోపాల్‌రెడ్డి సోమవారం విడుదల చేశారు. అభ్యర్థులు ఏప్రిల్ 13 నుంచి మే 7 వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. ఓయూతో పాటు తెలంగాణ వర్సిటీ, పాలమూరు, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయాల్లోని క్యాంపస్ కళాశాలలు, అనుబంధ, ప్రైవేటు పీజీ కాలేజీల్లో 2016-17 విద్యా సంవత్సరానికి ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంసీజే, ఎంఎల్‌ఐసీ, ఐదేళ్ల పీజీ కోర్సులు, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఓయూ సెట్ నోటిఫికేషన్ విడుదల
Published Mon, Apr 11 2016 4:16 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
ఓయూలో వేసవి శిక్షణ తరగతులు
ఓయూ క్యాంపస్‌లోని ఆంధ్రమహిళా సభ లిటరసీ హౌజ్‌లో వేసవిలో వివిధ కోర్సుల్లో శిక్షణకు సోమవారం ప్రవేశ ప్రకటన విడుదలైంది. కంప్యూటర్‌లో వివిధ రకాల కోర్సులతో పాటు తెలుగు, ఇంగ్లిష్ టైపింగ్, డీటీపీ, ఫ్యాబ్రిక్, గ్లాస్, పాట్ పెయింటింగ్, పేపర్, జూట్ బ్యాగ్ మేకింగ్, చాక్లెట్, జువెలరీ మేకింగ్ తదితర కోర్సులలో 10-18 ఏళ్ల బాలికలకు శిక్షణ ఇవ్వనున్నారు. అలాగే 7-12 ఏళ్ల చిన్నారులకు టాయ్స్ అండ్ జాయ్స్ గేమ్స్‌లో శిక్షణ ఇవ్వనున్నట్లు సెక్రెటరీ నాగలక్ష్మీ తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 18 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు 8790409907/ 040-27098406 నంబర్లకు ఫోన్‌చేసి తెలుసుకోవచ్చునని ఆమె తెలిపారు.
Advertisement
Advertisement