
తెలుగు వర్సిటీలో పీహెచ్‌డీ పేపర్ లీక్
హైదరాబాద్: తెలుగు విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ, ఎంఫీల్ ఎంట్రన్స్ పరీక్ష పేపర్ లీక్ కావడం కలకలం రేపింది. రీసెర్చ్ మెథడాలజీకి సంబంధించిన కామన్ పేపర్ లీకైంది. గురువారం పరీక్ష కేంద్రానికి వచ్చిన ఓ విద్యార్థి 50 ప్రశ్నలకు చేతిపై సమాధానాలు రాసుకొని రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
దీంతో అభ్యర్థులు పరీక్షలను బహిష్కరించి ఆందోళనకు దిగారు. పరీక్ష పత్రం లీక్ కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఆందోళన చేస్తున్న అభ్యర్థులను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారు. లీక్ నేపథ్యంలో ఎంట్రన్ పరీక్షను వాయిదా వేసినట్టు తెలుస్తోంది.