ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల దందాను అరికట్టాలంటూ వివిధ విద్యార్థి సంఘాల వారు గురువారం ఆందోళనలు చేపట్టారు.
ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల దందాను అరికట్టాలంటూ వివిధ విద్యార్థి సంఘాల వారు గురువారం ఆందోళనలు చేపట్టారు. బోడుప్పల్‌లోని భాష్యం స్కూల్‌తోపాటు శంషాబాద్‌లోని ఎస్సార్ డీజీ స్కూల్ ఎదుట ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ సంఘాల ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. విద్యార్థుల తల్లిదండ్రులను ఆర్థికంగా ఇబ్బందిపెట్టేలా ఉన్న ఫీజుల మోతను తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.