విద్యను వ్యాపారంగా మార్చొద్దు
హైదరాబాద్: ఖాజాగూడ చిత్రపురి హిల్స్‌లో కైరోస్ గ్లోబల్ స్కూల్‌ను ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రైవేటు పాఠశాలలు ఫీజుల విషయంలో స్వీయనియంత్రణ పాటించాలని సూచించారు. ప్రైవేటు స్కూల్స్ విద్యను వ్యాపారంగా చూడొద్దని చెప్పారు. పిల్లలకు ఎడ్యుకేషన్ ఎంత అవసరమో డిజిటల్ ఎడ్యుకేషన్ కూడా అంతే అవసరమని స్పష్టం చేశారు.
నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 500 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసిందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మహేందర్‌రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, శంభీపూర్ రాజు, జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు పాఠశాల యాజమాన్యం పాల్గొన్నారు.