రంగారెడ్డి జిల్లాలో కొత్తగా ప్రైవేట్ పాఠశాలలకు అనుమతులు నిలిపివేస్తున్నట్లు మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. గురువారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలపై పలువురు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వైపు ప్రభుత్వం బడిబాట నిర్వహిస్తుండగానే మరోవైపు ప్రైవేట్ స్కూళ్లకు అనుమతులివ్వటం ఏమిటని పలువురు సభ్యులు అధికార పక్షాన్ని ప్రశ్నించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు లేవు..టీచర్లు లేరు..కొన్ని చోట్ల పిల్లలు లేరు..అంటూ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి స్పందించిన మంత్రి.. ప్రైవేట్ పాఠశాలలకు కొత్తగా అనుమతులు ఇవ్వవద్దంటూ అధికారులను ఆదేశించారు.
‘కొత్తగా ప్రైవేట్ స్కూళ్లకు అనుమతులు ఆపండి’
Published Thu, Jun 16 2016 4:29 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM
Advertisement