అతడే నాకు ‘సరైనోడు’.. | rakul preeth sing special chit chat with fm radio | Sakshi
Sakshi News home page

అతడే నాకు ‘సరైనోడు’..

Published Thu, Apr 21 2016 12:01 AM | Last Updated on Tue, Jul 23 2019 11:50 AM

అతడే నాకు ‘సరైనోడు’.. - Sakshi

అతడే నాకు ‘సరైనోడు’..

బంజారాహిల్స్: అందాల తార రకుల్ ప్రీత్‌సింగ్ బుధవారం బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని రేడియో సిటీలో సందడి చేసింది. తాజాగా తాను నటించిన ‘సరైనోడు’ చిత్ర విశేషాలను శ్రోతలతో పంచుకుంది. సినిమాలో తన పాత్ర, అల్లు అర్జున్ అద్భుత నటన గురించి వివరించింది. ఈ సందర్భంగా ఆమె ‘సాక్షి’తో ప్రత్యేకంగా సంభాషించింది. ఆ విశేషాలు రకుల్ మాటల్లోనే.. ‘హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. రంజాన్ టైమ్‌లో చార్మినార్ దగ్గర దొరికే హలీం అంటే ఇంకా ఇష్టం. నాకు హైదరాబాద్ లైఫ్‌నిచ్చింది. విదేశాల్లో షూటింగ్ చేసేటప్పుడు హైదరాబాద్‌ను మిస్ అవుతున్న ఫీలింగ్ కలుగుతుంది.


నా జీవితంలో ఇంత వరకు ‘సరైనోడు’ తగల్లేదు. నేను నాలుగు ఇంచెస్ హీల్ వేసుకున్నా నాకన్నా అతడు హైట్ ఉండాలి. దీంతో పాటు మంచి హ్యూమన్ బీయింగ్ ఉన్నోడే నాకు సరైనోడు’.. అని పేర్కొంది. తాను హైదరాబాద్‌లో ఇల్లు కొన్నానని, త్వరలోనే గృహ ప్రవేశం ఉంటుందని చెప్పింది. తన మొదటి చిత్రం నుంచి చివరి సినిమా వరకు ఏం నేర్చుకున్నానన్నదే తన అచీవ్‌మెంట్‌గా భావిస్తానంది. హిందీలో ‘సరైనోడు’ సినిమా తీస్తే రణవీర్ సింగ్ హీరోగా ఉండి, తాను హీరోయిన్‌గా ఉండాలని కోరుకుంటానంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement