కోర్టుకు రావెల కుమారుడు
హైదరాబాద్: మహిళను వేధించిన కేసులో మంత్రి రావెల కుమారుడు సుశీల్ను బంజారా హిల్స్ పోలీసులు శుక్రవారం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. అతడికి అంతకు ముందు విధించిన రెండు రోజుల కస్టడీ ముగియడంతో కోర్టుకు తీసుకొచ్చారు. మహిళను వేధించిన కేసులో చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ఏపీ మంత్రి రావెల కిషోర్ తనయుడు రావెల సుశీల్, అతని డ్రైవర్ రమేష్‌లను బంజారాహిల్స్ పోలీసులు బుధవారం కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే.
ఈ నెల 3న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో అంబేడ్కర్ బస్తీకి చెందిన టీచర్ ఫాతిమా బేగంను వెంబడించి, వేధించిన ఘటనలో సుశీల్, రమేష్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వీరిని విచారించేందుకు కోర్టు రెండు రోజులపాటు పోలీసు కస్టడీ విధించింది. దీంతో బంజారాహిల్స్ పోలీసులు కస్టడీకి తీసుకొని శుక్రవారం కోర్టుకు తరలించారు. కోర్టులో విచారణ అనంతరం చంచల్ గూడ జైలుకు తరలించారు.