టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ తరువాత రెండో దశ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలీసెట్-2016 మొదటి దశ ప్రవేశాలు పూర్తయ్యాయి. మే 20 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను చేపట్టిన సాంకేతికవిద్యాశాఖ 23 నుంచి 31 వరకు వెబ్‌ఆప్షన్లకు అవకాశం కల్పిం చింది. వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్న విద్యార్థులకు బుధవారం సీట్లను కేటాయించినట్లు పాలీ సెట్ కన్వీనర్ డాక్టర్ ఎంవీ రెడ్డి తెలిపారు. పాలీసెట్‌లో 1,03,005 మంది అర్హత సాధిం చగా, 47,127 మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కు హాజరయ్యారు. అందులో 45,644 మంది ఆప్షన్లను ఇచ్చుకున్నారు. వారిలో 37,467 మంది (74 శాతం) విద్యార్థులకు సీట్లను కేటాయించారు.
వీరు గురువారం నుంచి 8వ తేదీ వరకు వెబ్‌సైట్ నుంచి సీట్ల కేటాయింపు లెటర్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని ఎంవీ రెడ్డి తెలిపారు. అలాగే ఎస్‌బీహెచ్‌లో ఫీజును చలానా రూపంలో చెల్లించాలన్నారు. ఇక విద్యార్థులు వెబ్‌సైట్‌లో ఇచ్చిన ప్రత్యేక లింకు ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని (కాలేజీలో చేరుతామని కన్‌ఫర్మ్ చేయాలి) వెల్లడించారు. తర్వాత విద్యార్థులు తమ సర్టిఫికెట్లతో కాలేజీలకు వెళ్లి ఈనెల 5 నుంచి 9 మధ్య చేరాలని సూచించారు. వివరాలను ్టటఞౌడఛ్ఛ్టి.జీఛి.జీ లో చూడవచ్చన్నారు. ఈ నెల 9 నుంచి తరగతులు ప్రారంభమవుతాయన్నారు. మొత్తం 50,632 సీట్లుండగా, అందులో 37,467 సీట్లు విద్యార్థులకు కేటాయించారు. మిగతా సీట్లకు టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల య్యాక రెండోదశ కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు.
పాలిటెక్నిక్‌లలో 74 శాతం సీట్లు భర్తీ
Published Thu, Jun 2 2016 3:43 AM | Last Updated on Tue, Sep 18 2018 7:45 PM
Advertisement
Advertisement