అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించాలి | Reservation for upper caste poor | Sakshi
Sakshi News home page

అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించాలి

Published Sat, Apr 30 2016 3:18 AM | Last Updated on Sun, Sep 3 2017 11:03 PM

Reservation for upper caste poor

ఈబీసీ సంక్షేమ సంఘం డిమాండ్

 సాక్షి, హైదరాబాద్: అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించాలని ఈబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు వల్లపురెడ్డి రవీందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. అగ్రకులాల పేరిట ప్రభుత్వాలు వీరికి తీవ్ర అన్యాయం చేస్తున్నాయన్నారు. అగ్రకులాల్లో 80 శాతం పైగా ఉన్న పేదవర్గాల అభివృద్ధి, సంక్షేమంపై ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్ల కల్పన కోసం ఉద్యమిస్తామన్నారు. దీనిపై త్వరలోనే హైదరాబాద్‌లో అవగాహన సదస్సును నిర్వహిస్తామన్నారు. ఏపీ,తెలంగాణలతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉద్యమాలపై ఈ సదస్సులో భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకుంటామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement