‘అకున్ సబర్వాల్‌ను తప్పించేందుకు యత్నాలు’
Published Fri, Jul 14 2017 2:32 PM | Last Updated on Fri, May 25 2018 2:11 PM
హైదరాబాద్: డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ ను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే విచారణ నుంచి తప్పిస్తోందని టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. తక్షణమే ఆయన సెలవులు రద్దుచేసి కేసు పూర్తి అయ్యే వరకు విచారణ అధికారిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వంలోని పెద్దలకు సన్నిహితులైన కొందరు సినీ ప్రముఖులను ఈ కేసు నుంచి తప్పించడానికే అకున్‌ను సెలవుపై పంపిస్తున్నారని తెలిపారు. విచారణ జరిగే సందర్భంలోనే ఆయన సెలవుపై వెళ్లడం ఒత్తిళ్లకు నిదర్శనమని అన్నారు. కాగా అకున్‌సబర్వాల్ 10 రోజుల పాటు సెలవుపై వెళ్లనున్నారు. తమపై ఎలాంటి ఒత్తిడి లేదని, ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉందని అకున్ తెలిపారు.
Advertisement
Advertisement