
సాక్షి, హైదరాబాద్: నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు వచ్చే రాష్ట్ర బడ్జెట్‌లో నిధు ల కేటాయింపుపై ఆర్థికశాఖ కొంత స్పష్టతనిచ్చింది. సాగునీటి కోసం రూ.29 వేల కోట్లు కేటాయించేందుకు సుముఖత తెలిపింది. బడ్జెట్ నుంచి రూ.20 వేల కోట్ల కేటా యింపుకు సూచనప్రాయంగా అంగీకరించింది. మిగతా రూ.9 వేల కోట్లను బడ్జెటేతర నిధుల నుంచి సమకూర్చుకోవాలని, రుణా ల ద్వారా తీసుకోవాలని పేర్కొంది.
మంగళవారం సచివాలయంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు నేతృత్వంలో నీటి పారుదల శాఖ బడ్జెట్ ప్రతిపాదనలపై జరిగిన సమావేశంలో నీటి పారుదల శాఖ తరఫున ఈఎన్‌సీ మురళీధర్, వివిధ∙ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్లు పాల్గొన్నారు. తమ శాఖ అవసరాలను ఆర్థిక శాఖ ముందుంచారు. రూ.29,208 కోట్ల మేరకు ప్రతిపాదనలు సమర్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రతిపాదించిన రూ.9 వేల కోట్లను మొత్తం బడ్జె ట్ ప్రతిపాదన నుంచి వేరు చేయాలని ఆర్థిక శాఖ అధికారులు సూచించారు.
రూ.20 వేల కోట్లను బడ్జెట్ నుంచి కేటాయిస్తామని, మిగ తా వాటిని బ్యాంకుల నుంచి సమకూర్చుకోవాలని సూచించగా నీటి పారుదల శాఖ ఓకే అన్నట్లు తెలిసింది. కాగా, కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో ఫిబ్రవరి 10న 15వ ఆర్థిక సంఘం సభ్యులు పర్యటించనున్నారు. సంఘం సభ్యులు శక్తికాంతదాస్, అనూప్‌సింగ్, రమేశ్ చంద్, అశోక్ లహిరి ప్రాజెక్టు పరిధిలో పర్యటించే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment