శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్ నుంచి భద్రాచలంకు ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు ఆర్టీసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 15వ తేదీన జరుగనున్న సీతారామచంద్రుల కల్యాణమహోత్సం, 16వ తేదీన జరుగనున్న పటాభిషేకం వీక్షించేందుకు హైదరాబాద్ నుంచి బయలుదేరనున్న భక్తుల కోసం వివిధ ప్రాంతాల నుంచి ఈ ప్రత్యేక బస్సులు బయలుదేరుతాయి.
ఈ నెల 14వ తేదీ ఉదయం నుంచి 15వ తేదీ రాత్రి వరకు బీహెచ్‌ఈఎల్, కూకట్‌పల్లి, ఎంజీబీఎస్‌ల నుంచి నేరుగా భద్రాచలంకు ప్రత్యేక బస్సులు బయలుదేరుతాయి. నగరంలోని అన్ని ఏటీబీ కేంద్రాల నుంచి, బస్‌స్టేషన్‌ల నుంచి అడ్వాన్స్ టిక్కెట్‌లు పొందవచ్చు. ప్రత్యేక బస్సులకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఫోన్ 7382856644,7382858517 నెంబర్‌లను సంప్రదించవచ్చు.