శబరిమలైలో గది బుక్ చేసుకోండిలా
మండల కాలం పాటు అయ్యప్ప దీక్ష చేసి స్వామికి ఇరుముడి సమర్పించడానికి లక్షల సంఖ్యలో భక్తులు శబరిమలకు తరలివెళ్తారు. అక్కడ దర్శనానికి స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకున్నాం. అదేవిధంగా అక్కడ వసతి సౌకర్యం కూడా పొందవచ్చు. ఇందుకు ట్రావెకొర్ దేవోసమ్ బోర్డు వారు అవకాశం కల్పిస్తారు. మరి సన్నిధానంలో వసతి ఎలా పొందాలి? ఎన్ని రోజులు ఉండవచ్చు, వసతి పొందడానికి విధివిధానాలు అయ్యప్ప భక్తులు కోసం... - గాజులరామారం
ఆన్‌లైన్‌లో లాగిన్ అవ్వండిలా...
* ముందుగా http://www.sabarimalaaccomodation.comలో సైన్‌అప్ అవ్వాలి.
* ఇందుకు విండోలో కనిపిస్తున్న ఆన్‌లైన్‌లో రిజర్వేషన్‌ను క్లిక్ చేయండి.
* ఇక్కడ మీకు కుడి వైపున చివర సైన్‌అప్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
* స్క్రీన్‌పై కనిపిస్తున్న రిజిస్ట్రేషన్ ఫామ్‌లో మీ పూర్తి వివరాలు నమోదు చేయాలి.
* ‘స్టార్’ గుర్తు ఉన్న చోట వివరాలు ఇవ్వాలి.
* అంతా పూర్తయ్యాక సెక్యూరిటీ కోడ్‌ను ఎంటర్ చేసి సబ్‌మిట్ చేయాలి.
* ఇప్పుడు మీరు ఇచ్చిన ఈ-మెయిల్‌కు యూజర్ నేమ్, పాస్‌వర్డ్ వస్తుంది.
* దానితో సైన్‌ఇన్ అయ్యి మీకు నచ్చిన యూజర్ నేమ్, పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకోండి.
* లాగిన్ అయ్యాక విండోలో మీకు కనిపిస్తున్న రూమ్ రిజర్వేషన్‌ను క్లిక్ చేయండి.
* రిజర్వేషన్‌కు సంబంధించిన నియమాలు‘టర్మ్స్’ కనిపిస్తాయి. దాన్ని ఆమోదిస్తే జనరల్ రూమ్ రిజర్వేషన్ ఫామ్ వస్తుంది.
* ఇక్కడ మీకు ఎప్పుడు రూం కావాలి, ఏ సమయంలో కావాలి, ఎప్పుడు ఖాళీ చేస్తారు, దాని సమయం తెలపాలి. అదేవిధంగా ఎంతమంది బస చేస్తారో చెప్పాలి.
* వివరాలు పూర్తయ్యాక చెక్ ఎవెలబిలిటీ క్లిక్ చేస్తే అందుబాటులో ఉన్న రూంల వివరాలు వస్తాయి.
* అందుబాటులో ఉన్న సదుపాయాన్ని బట్టి రూంను ఎంచుకోండి.
* తర్వాత మీ పూర్తి వివరాలు ఇవ్వాలి. ‘రిజర్వ్ ఫర్ లాడ్జ్ ఇన్ యూజర్’ను క్లిక్ చేస్తే ప్రత్యేకంగా మీ వివరాలు ఇవ్వాల్సిన పనిలేదు.
* తర్వాత ప్రొసీడ్ క్లిక్ చేసి పేమెంట్ చేయండి.
నోట్: ప్రస్తుతానికి ఇంకా ఆన్‌లైన్ రూం రిజిస్ట్రేషన్ మెదలు కాలేదు. త్వరలో ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తారు. అవసరమనుకున్న వారు ముందుగా యూజర్‌నేమ్, పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు.
సూచనలు: పేమెంట్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారానే చేయాలి. రిజర్వేషన్ చార్జ్ రూ.100 ఉంటుంది. రూం రెంట్ అదనం. రిజర్వ్ చేసుకున్న తర్వాత రద్దు చేయబడదు. డబ్బులు కూడా వెనక్కి ఇవ్వరు.