గ్రేటర్ లో సల్మాన్ ఖాన్కు ఓటు!
హైదరాబాద్: ఎన్నికల అధికారుల పనితీరు మరోసారి హాస్యాస్పదంగా మారింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ఓటర్ల జాబితాలో బాలీవుడ్ నటుడుకు ఓటు హక్కు కల్పించారు.
ఓల్డ్సిటీ గౌలిపుర డివిజన్లో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓటు నమోదైంది. సల్మాన్ ఖాన్ వయస్సు 64 సంవత్సరాలుగా తండ్రిపేరు సలీంఖాన్ లిస్ట్లో ఉంది. అధికారుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా పలువురి వీఐపీల పేర్లు వివిధ ప్రాంత్రాల్లో నమోదైన విషయం తెలిసిందే.