సాక్షి, హైదరాబాద్: ఉభయ రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల్లో శాశ్వత లోక్ అదాలత్‌ల చైర్మన్లుగా పనిచేస్తున్న పలువురు జిల్లా జడ్జీలను ఉమ్మడి హైకోర్టు బదిలీ చేసింది. ఈ మేరకు రిజిష్ట్రార్ జనరల్ మానవేంద్రనాథ్ రాయ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
► హైదరాబాద్ శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ డాక్టర్ సీహెచ్ నిర్మల దయావతి ఆదిలాబాద్ ఫ్యామిలీ కోర్ట్ కమ్ నాల్గవ అదనపు జిల్లా సెషన్స్ జడ్జిగా బదిలీ అయ్యారు.
► నిజామాబాద్ శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ మహ్మద్ నూరుల్లా ఘోరీ ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక ప్రత్యేక న్యాయస్థానం కమ్ 8వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జీగా బదిలీ అయ్యారు.
► రంగారెడ్డి జిల్లా శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ సాంబశివరావు నాయుడు కరీంనగర్ జిల్లా గోదావరి ఖని ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ కమ్ లేబర్ కోర్ట్ ప్రిసైడింగ్ అధికారిగా నియమితులయ్యారు.
► వరంగల్ శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ పి.వి.రమణరావు మహబూబాబాద్ 6వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జిగా బదిలీ అయ్యారు.
► అనంతపురం శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ కె.వి.మహాలక్ష్మి అదే జిల్లా మొదటి అదనపు జిల్లా సెషన్స్ జడ్జిగా నియమితులయ్యారు.
► తూర్పుగోదావరి శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ ఎన్.మాల్యాద్రి కాకినాడ 3వ అదనపుజిల్లా సెషన్స్ జడ్జిగా నియమితులయ్యారు.
► కడప శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ వి.అప్పారావు గుంటూరు ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ కమ్ లేబర్ కోర్టు ప్రిసైడింగ్ అధికారిగా నియమితులయ్యారు.
► మచిలీపట్నం శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ ఎస్.రజనీ అదే ప్రాంత ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక ప్రత్యేక న్యాయస్థానం జడ్జిగా, 10వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జిగా బదిలీ అయ్యారు.
► ఒంగోలు శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ బి.వి.నాగేంద్రరావు అనకాపల్లి 10 అదనపు జిల్లా సెషన్స్ జడ్జిగా బదిలీ అయ్యారు.
► శ్రీకాకుళం శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ షేక్ ఇంతియాజ్ కర్నూలు 3వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జిగా బదిలీ అయ్యారు.
పలువురు జిల్లా జడ్జీల బదిలీలు
Published Sat, Feb 4 2017 2:06 AM | Last Updated on Fri, Aug 31 2018 8:31 PM
Advertisement
Advertisement