బంజారాహిల్స్ : కన్న తండ్రే కీచకుడై కూతురిని కాటేసిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... యూసుఫ్‌గూడ సమీపంలోని ఎల్‌ఎన్‌నగర్‌లో నివసించే బాలిక (14) 9వ తరగతి చదువుతోంది. ఆమెను తండ్రి సయ్యద్ రషీద్ కొంతకాలంగా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. రెండు రోజులు క్రితం బాలిక నిద్రిస్తున్న సమయంలో లైంగికదాడికి పాల్పడ్డాడు. విషయం బయటకు పొక్కితే చంపేస్తానంటూ బెదిరించడంతో బాధిత బాలిక రెండు రోజులుగా బాధను గుండెల్లోనే దాచుకుంది. తీవ్ర రక్తస్రావం జరగడంతో ఈ విషయాన్ని తల్లికి చెప్పింది.
దీంతో తల్లి కూతుర్ని తీసుకొని బంజారాహిల్స్ ఠాణాకు వచ్చి భర్తపై ఫిర్యాదు చేసింది. తాను 7వ తరగతిలో ఉన్నప్పుడు కూడా ఒకసారి తండ్రి లైంగికదాడికి పాల్పడ్డాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 376 కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
కూతుర్ని కాటేసిన తండ్రి
Published Fri, Aug 28 2015 12:24 AM | Last Updated on Wed, Apr 3 2019 4:08 PM
Advertisement
Advertisement