హైదరాబాద్ : మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా హైదరాబాద్, సికింద్రాబాద్‌ల నుంచి శ్రీశైలం, ఏడుపాయల జాతరలకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు గ్రేటర్ ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ఈ నెల 6 వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఈ బస్సులు రాకపోకలు సాగిస్తాయి. శ్రీశైలం వెళ్లే భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని 274 బస్సులు, ఏడుపాయల జాతరకు 50 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ప్రణాళికలను రూపొందించినట్లు ఆర్టీసీ సికింద్రాబాద్ రీజినల్ మేనేజర్ కొమురయ్య తెలిపారు.
రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచుతామన్నారు. నగరంలోని జూబ్లీ, ఎంజీబీఎస్, దిల్‌సుఖ్‌నగర్ బస్‌స్టేషన్‌లతో పాటు, ఈసీఐఎల్, సికింద్రాబాద్ బ్లూ సీ హోటల్ ఎదురుగా, ఆఫ్జల్‌గంజ్, ఘట్కేసర్, లోతుకుంట, ఉప్పల్, తార్నాక, తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు.
శివరాత్రికి జంట నగరాల నుంచి ప్రత్యేక బస్సులు
Published Sat, Mar 5 2016 7:17 PM | Last Updated on Mon, Oct 8 2018 7:04 PM
Advertisement