గాలివాన బీభత్సం..
అరగంట వానకు.. అంతా అస్తవ్యస్తం
- రహదారులపై విరిగిపడిన చెట్లు
- ఈదురుగాలులు, పలుచోట్ల పిడుగులు
- ఒరిగిపోయిన విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు
- అంధకారం.. కరెంటు సరఫరాకు అంతరాయం
సాక్షి, నెట్‌వర్క్: రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో శుక్రవారం సాయత్రం నుంచి రాత్రి వరకు ఉరుములు, గాలిదుమారంతోపాటు భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. కొన్నిచోట్ల పిడుగులు కూడా పడ్డాయి. బలంగా వీచిన గాలులకు చెట్లు కూలడంతోపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వర్షానికి తోడు సుమారు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడంతో భారీ వృక్షాలు నేలకూలాయి. చెట్లకొమ్మలు విరిగిపడ్డారుు. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు నేలకూలారుు. చెట్లు విరిగి విద్యుత్ వైర్లపై పడటంతో వైర్లు తెగిపోయూరుు.
►కరీంనగర్‌లో అరగంట వర్షంతో నగరం అతలాకుతలమైంది. కరీంనగర్ కలెక్టరేట్ ముందు, మంకమ్మతోటలో సెల్‌ఫోన్ టవర్లు, హోర్డింగ్‌లు కూలిపోయాయి. కలెక్టరేట్ వెనుక భాగంలో మూడు విద్యుత్ స్తంభాలతోపాటు ట్రాన్స్‌ఫార్మర్ నేలకూలింది. మిగతా ప్రాం తాల్లో కూడా చెట్లు విరిగిపడి విద్యుత్ వైర్లు తెగిపోయాయి. దీంతో కరీంనగర్‌లో అంధకారం నెల కొంది. రాత్రి 10 గంటల వరకు కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించగా, మిగతా ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకూ అంధకారం అలుముకుంది.
►వరంగల్ జిల్లా నర్మెట మండల కేంద్రంతోపాటు అమ్మాపురం, వెల్దండ, అంకుషాపూర్, తరిగొప్పుల, వర్ధన్నపేట, కొత్తపల్లి, ల్యాబర్తి, ఇల్లంద తదితర గ్రామాల్లో గాలులతో కూడిన వర్షం కురిసింది. అంకుషాపూర్ గ్రామ ఫరిది మాన్‌సింగ్ తండాలో ఇంటి పైకప్పు కూలిపోయింది. అమ్మాపురం గ్రామానికి చెందిన గుంటిపల్లి పూలమ్మ, గుంటిపల్లి రాములు ఇళ్ల రేకులు గాలికి లేచి కిందపడి పగిలిపోయాయి. గాలివానతో సోలిపురం, అంకుషాపూర్, తరిగొప్పుల, బొత్తలపర్రె, హన్మంతాపూర్ గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు విరిగి సరఫరా నిలిచిపోరుుంది. వర్ధన్నపేట మండలంలోనూ పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం వాటిల్లింది. వరంగల్ జిల్లా చిట్యాల మండలం వెంకట్రావుపల్లి(బి)కి చెందిన నిమ్మల లింగమ్మ(60) ఇల్లుగోడ కూలింది. ఆ సమయంలో లింగమ్మపై గోడ పడడంతో మృతి చెందింది.
►నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం ఆలూర్ గ్రామంలో శుక్రవారం సాయంత్రం పిడుగు పాటుకు రెండు ఎడ్లు మృతి చెందాయి. మాచారెడ్డి మండలం ఫరీదుపేటలో విద్యుత్ స్తంభాలతోపాటు ఇళ్ల రేకు లు, చెట్లు విరిగిపడ్డాయి. బీర్కూర్ మండలంలో మిర్జాపూర్‌లో మూడు విద్యుత్ స్తం భాలు నేలకొరిగాయి. పిట్లం మండలం ధర్మారం, పిట్లంలో రెండు చెట్లు, మూడు స్తంభాలు నేలకూలాయి. పిట్లం వారాం తపుసంతలోని డేరాలు గాలికి ఎగిరిపోవడంతో వ్యాపారులు ఇబ్బందు లు పడ్డారు.
►ఆదిలాబాద్ జిల్లాలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతోపాటు పిడుగులు పడడంతో 6 పశువులు మృతి చెందగా ఐదుగురు గాయపడ్డారు. నిర్మల్, జైపూర్, చెన్నూర్, వేమనపల్లి, లక్సెట్టిపేట, జన్నారం, తానూర్ మండలాల్లో ఈదురుగాలులకు చెట్లు విరిగిపడి విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ఇళ్ల రేకులు ఎగిరిపడ్డారుు. నిర్మల్‌లోని మంజు లాపూర్ రోడ్డులో ఓ పాఠశాల ప్రహరీ కూలిపోరుుంది. వేమనపల్లిలో ఇంటిపై చెట్టు పడడంతో ఇల్లు ధ్వంసమైంది. పలువురి ఇళ్ల పైకప్పులు గాలికి ఎగిరిపోయూరుు. జైపూ ర్ మండలంల కొత్తపల్లిలో ఇంటిపై పిడు గుపడడంతో ముగ్గురు గాయపడ్డారు.
►ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తనికెళ్ల గ్రామంలోని హైవేపై గాలికి భారీ చెట్టు కూలడంతో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
కాల్వలో పడిన ఆటో.. నలుగురి మృతి
ఖమ్మం రూరల్ : గాలులకు ఆటో అదుపు తప్పి ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం తానంచర్ల కాల్వలో పడింది. ఆటలో ఉన్న నల్లగొండ జిల్లా కోదాడ మండలం తమ్మరకు చెందిన దంప తులు జ్యోతి (45), లింగ్యా (50)తోపాటు లక్ష్మణ్ (25), డ్రైవర్ మృతి చెందారు. శుభ కార్యానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
రైళ్ల రాకపోకలకు అంతరాయం
ఉప్పల్-హసన్‌పర్తి రైల్వేస్టేషన్ల మధ్య శుక్రవారంరాత్రి వీచిన భారీ ఈదురుగాలులకు హైటెన్షన్ విద్యుత్ తీగలు తెగిపోయి రైళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. న్యూఢిల్లీ నుంచి చెన్నై వెళ్లే గ్రాండ్ ట్రంక్ (జీటీ) సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు రామగుండం రైల్వేస్టేషన్‌లో సాయంత్రం గంటసేపు నిలిపివేసినట్లు రైల్వే ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఎల్కతుర్తి మండల బావుపేట శివారులో 348 కిలోమీటర్ వద్ద గాలి దుమారానికి విద్యుత్ వైరు తెగిపోవడంతో సిరి పూర్ కాగజ్‌నగర్ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ రైలు నిలిచిపోయింది. తర్వాత విద్యుత్ పనులను పునరుద్ధరించడంతో రైళ్ల రాకపోకలు యథావిధిగా సాగారుు.
పిడుగుపాటుకు నలుగురు మృతి
పిడుగుపాటుకు నలుగురు మృత్యువాత పడ్డారు. కరీంనగర్ మండలం నగునూర్‌లో కొత్తకొండ హన్మయ్య (66), కాటా రం మండలం దామెరకుంట లో యాదెళ్ల మొండయ్య (35) అనే గొర్లకాపరి పిడుగుపాటుతో మృతి చెందారు. వరంగల్ జిల్లా చిట్యాల మం డలం వెంకట్రావుపల్లి(బి)కి చెందిన నిమ్మల లింగమ్మ (60) ఇంటిగోడ కూలి మీద పడడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఇంటి పైకప్పు రేకులు మీద పడడంతో నర్సం పేట మండలం ఆకులతండాలో పి.ఊర్మిల (38) మృతి చెందింది.