- రాష్ట్రంలో విభిన్న వాతావరణం
- మరో రెండు రోజులు ఎండలు.. నాలుగు రోజులు వానలు
సాక్షి, హైదరాబాద్: ఇటు తీవ్ర ఎండలు, వడగాడ్పులు.. అటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు రాష్ట్రాన్ని ముంచెత్తనున్నాయి. రాష్ట్రంలోని పలు చోట్ల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. ఇంకోవైపు ఉరుములు, మెరుపులతో కూడిన జడివానలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులపాటు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, మెదక్, నల్లగొండ జిల్లాల్లో కొన్నిచోట్ల వడగాడ్పులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ శనివారం వెల్లడించింది.
ఇదే సమయంలో దాదాపు అన్ని జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో నాలుగు రోజుల పాటు ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. శనివారం రామగుండం, ఆదిలాబాద్‌లలో అత్యధికంగా 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక గత 24 గంటల్లో మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంటలో 5 సెంటీమీటర్లు, కొడంగల్‌లో 4, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లా తాండూరులో 3 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.
ఇటు వడగాడ్పులు.. అటు వర్షాలు
Published Sun, May 22 2016 3:35 AM | Last Updated on Tue, Oct 16 2018 4:56 PM
Advertisement