బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వైపు అల్పపీడన ద్రోణి ఏర్పడటంతో రాష్ట్రంలో నాలుగు రోజులపాటు ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.
హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడి
సాక్షి, హైదరాబాద్: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వైపు అల్పపీడన ద్రోణి ఏర్పడటంతో రాష్ట్రంలో నాలుగు రోజులపాటు ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు రామగుండంలో శుక్రవారం 46 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే ఆదిలాబాద్‌లో 44.5 డిగ్రీలు, హన్మకొండలో 43.5, నిజామాబాద్‌లో 43.1, హైదరాబాద్‌లో 40.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక హైదరాబాద్‌లో సాయంత్రం నుంచి పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది.