
నకిలీ స్వీట్ తయారీ కేంద్రంపై దాడి
హైదరాబాద్: రసాయనాలు, నాసిరకం పదార్ధాలతో స్వీట్లు తయారుచేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న తయారీ కేంద్రంపై ఎస్‌వోటీ పోలీసులు శనివారం సాయంత్రం దాడి చేశారు. మల్కాజిగిరిలోని ఈ తయారీ కేంద్రంలో రసాయనాలు కలిపి తయారుచేస్తున్న ఆగ్రా పేడాలను, స్వీట్ల తయారీకి వాడుతున్నరసాయనాలతోపాటు 1500 బూడిద గుమ్మడికాయలను సీజ్ చేశారు. ఇక్కడ తయారు చేసే స్వీట్లను తక్కువ ధరలకే నగరంలోని మిఠాయి దుకాణాలకు సరఫరా చేస్తుంటారని పోలీసులు తెలిపారు. ఈ మేరకు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.