వాట్సాప్‌లో తలాఖ్.. తలాఖ్.. తలాఖ్
అమెరికాలో పనిచేస్తున్న యువకుడి నిర్వాకం
► భార్యను ఇంటి నుంచి వెళ్లగొట్టేందుకు పన్నాగం
► కోడలిపై హత్యాయత్నం.. అత్తామామల అరెస్ట్
హైదరాబాద్: భర్త వాట్సాప్‌లో తలాఖ్.. తలాఖ్.. తలాఖ్.. అంటూ మెసేజ్ పంపి భార్యను వది లించుకోవాలని చూడగా.. అత్తామామలు ఆమెపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో కోడలిపై హత్యాయత్నానికి పాల్పడిన అత్తామామలను మొఘల్‌పురా పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మొఘల్‌పురా ఈస్ట్ చార్మినార్ ప్రాంతానికి చెందిన మహ్మద్ అబ్దుల్ హఫీజ్ అలియాస్ అబుబాకర్ ఖురేషి(69), సయ్యదా కుల్సుం అలి యాస్ ఆలియా సుల్తానాలు దంపతులు. వీరికి నలుగురు కుమారులు. మూడో కుమారుడు ఉస్మాన్ ఖురేషి అలియాస్ మహ్మద్ అబ్దుల్ అఖిల్ (25)కు చాదర్‌ఘాట్‌కు చెందిన మెహరీన్ నూర్ (20)తో 2015 ఏప్రిల్‌లో వివాహవైుంది.
వివాహవైున వెంటనే అబ్దుల్ ఉద్యోగ నిమిత్తం అమెరికాకు వెళ్లాడు. అనంతరం అత్తామామ ఖురేషి, ఆలియా సుల్తానా, ఆడపడుచు సబినా సుల్తానాలు మెహరీన్ నూర్‌తో తరచూ గొడవ పడేవారు. ఫిబ్రవరిలో అబ్దుల్‘తలాఖ్..తలాఖ్..తలాఖ్..’అంటూ భార్య మెహరీన్ నూర్‌కు వాట్సాప్‌లో మెసేజ్ పంపించాడు. అనంతరం మసీదుకు చెందిన ఖాజీ ద్వారా తలాఖ్‌నామా పత్రాలను రిజిస్టర్ పోస్టు ద్వారా పంపాడు. ఈ విషయమై మెహరీన్ నూర్ గత నెల 16న చాదర్‌ఘాట్ పోలీస్‌స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. 498ఎ కేసు నమోదు చేశారు. తలాఖ్ అంటూ వచ్చిన మెసేజ్‌లపై గత నెల 27న మెహరీన్ టి కోడలు ఫాతిమాతో కలసి అత్తారింటికి వచ్చింది. దీంతో వీరి మధ్య మాట మాట పెరిగి గొడవ జరిగింది. దీనిపై మొఘల్‌పురా పోలీసులకు మెహరీన్ నూర్ ఫిర్యాదు చేసింది.
ఆందోళనకు దిగిన కోడలు.. అత్తామామల హత్యాయత్నం
ఈ నెల 2న భర్త అబ్దుల్ అఖిల్ తలాఖ్ నామాపై ఆరా తీసేందుకు తోటి కోడలు హీనా ఫాతిమాతో అత్తారింటికి వెళ్లింది. మొదటి అంతస్తులోని అత్తామామ కిందికి రాకపోవడం తో ఇంటి ముందు ఆందోళనకు దిగారు. అదే రోజు సాయంత్రం 4కు మెహరీన్ నూర్ పైకి వెళ్లడంతో అత్తామామ గొడవ పడ్డారు.
మామ అసభ్యకరంగా ప్రవర్తించి భార్యతో కలసి కోడలిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. మెహరీన్ కేకలు వేయడంతో గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న తోటికోడలు ఫాతిమా అక్కడికి చేరుకోగా వదిలేశారు. ఈ మేరకు మెహరీన్ మొఘల్‌పురా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని అత్తామామ అబుబాకర్ ఖురేషి, ఆలియా సుల్తానాలను శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఇన్ స్పెక్టర్ దేవేం దర్ తెలిపారు. గతంలో పెద్ద కోడలు హీనా ఫాతిమాను వేధింపులకు గురి చేయడంతో ఆమె భర్త ఫజుద్దీన్, అత్తామామలపై మీర్‌చౌక్ పీఎస్‌లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.