
ట్యాపింగ్‌పై ప్రభుత్వం వివరణ ఇవ్వాలి: చాడ
జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వివరణ ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర ...
హైదరాబాద్: జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వివరణ ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి బుధవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. కోదండరాం ఫోన్‌ను ట్యాప్ చేయడం వ్యక్తి స్వేచ్ఛను హరించడం, ప్రాథమిక హక్కుకు భంగం కలిగించడమే అవుతుందన్నారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఇప్పటివరకూ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపితే, ఫోన్‌ట్యాపింగ్‌కు పాల్పడతారా అని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని సీపీఐ తీవ్రంగా ఖండిస్తోందన్నారు.