పీఎస్లో లొంగిపోయిన పోకిరీ కార్పొరేటర్
హైదరాబాద్: ఎయిరిండియా విమానంలో తోటి ప్రయాణికురాలిపై అసభ్యంగా ప్రవర్తించిన కేసులో విజయవాడ టీడీపీ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు అలియాస్ చంటిబాబు శుక్రవారం ఉదయం శంషాబాద్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ఈ కేసులో పోలీసు స్టేషన్‌కు వచ్చి లొంగిపోవాలని శంషాబాద్ పోలీసులు చంటిబాబును ఇదివరకే కోరిన విషయం తెలిసిందే. అయితే తనకు రెండు రోజుల సమయం కావాలని చంటిబాబు విజ్ఞప్తి చేశాడు. ఇక అరెస్టు తప్పదని భావించిన ఈ పోకిరీ కార్పోరేటర్ చివరికి లొంగిపోయినట్లు తెలుస్తోంది.
ఢిల్లీలో ఓ యూనివర్సిటీలో పనిచేసే మహిళా ఫ్రొఫెసర్ రీతూవాసు ప్రిమలానీ ఎయిరిండియా విమానంలో ప్రయానిస్తున్న సమయంలో ఆమె పక్క సీట్లో కూర్చున్న ఉమ్మడి వెంకటేశ్వరరావు కాలితో పదేపదే తాకి అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలో కేసు నమోదైన విషయం తెలిసిందే.