'అసెంబ్లీలో చర్చించిన తర్వాతే సర్కార్ ముందుకెళ్లాలి' | Telangana clp meeting decisions are the following | Sakshi
Sakshi News home page

'అసెంబ్లీలో చర్చించిన తర్వాతే సర్కార్ ముందుకెళ్లాలి'

Published Sun, Jul 26 2015 3:28 PM | Last Updated on Sun, Sep 3 2017 6:13 AM

'అసెంబ్లీలో చర్చించిన తర్వాతే సర్కార్ ముందుకెళ్లాలి'

'అసెంబ్లీలో చర్చించిన తర్వాతే సర్కార్ ముందుకెళ్లాలి'

హైదరాబాద్ : అసెంబ్లీలో ప్రాజెక్టులపై చర్చించిన తర్వాతే టీఆర్ఎస్ సర్కార్ వాటి విషయంలో ముందుకెళ్లాలని సీఎల్పీ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ సీఎల్పీ భేటీ ముగిసింది. అసెంబ్లీ కమిటీ హాలులో జరిగిన ఈ భేటీలో నేతలు పలు నిర్ణయాలు తీసుకున్నారు.

  • తక్షణం అసెంబ్లీని సమావేశపరిచి కరువు, రైతుల ఆత్మహత్యల అంశాలను చర్చించాలి
  • ప్రాణహిత - చేవేళ్ల సహా ఇతర ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చించిన తర్వాతే తెలంగాణ సర్కార్ వాటిపై ముందుకెళ్లాలి
  • ప్రాణహిత - చేవేళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్పును వ్యతిరేకించి ప్రభుత్వాన్ని ఎండగట్టాలని సీఎల్పీ నిర్ణయించింది
  • ఈ ప్రాజెక్టు డిజైన్ అంశంలో సాంకేతిక అంశాలపై లోతుగా వెళ్లకుండా.. రాజకీయంగానే అధికార టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయాలని నిర్ణయం
  • పార్టీ ఫిరాయింపుల అంశంపై అసెంబ్లీ స్పీకర్ పై ఒత్తిడి పెంచాలని ఈ భేటీలో కాంగ్రెస్ నేతల బృందం నిర్ణయం తీసుకుంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement