కరెన్సీ కష్టాలపై కేసీఆర్‌ సమీక్ష | telangana cm kcr reviews on demonetization | Sakshi
Sakshi News home page

కరెన్సీ కష్టాలపై కేసీఆర్‌ సమీక్ష

Published Sun, Dec 4 2016 6:46 PM | Last Updated on Thu, Sep 27 2018 9:08 PM

కరెన్సీ కష్టాలపై కేసీఆర్‌ సమీక్ష - Sakshi

కరెన్సీ కష్టాలపై కేసీఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు క్యాంప్‌ ఆఫీసులో ఆదివారం ఉన్నతస్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర, ఆర్థిక శాఖ కార్యదర్శి ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత ఏర్పడిన పరిణామాలపై కేసీఆర్‌ అధికారులతో చర్చించారు. అలాగే కలెక్టర్ల కాన్ఫరెన్స్‌పై చర్చించారు. నగదు రహిత లావాదేవీల పెంపునకు తీసుకోవాల్సిన చర్యలపై కేసీఆర్‌ సమీక్షించారు. కరెన్సీ అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం దృష్టిసారిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement