హైదరాబాద్: తెలంగాణ టెన్త్ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి బుధవారం ఉదయం సచివాలయంలో పదో తరగతి ఫలితాలను విడుదల చేశారు. పరీక్షలు రాసిన 32 రోజుల్లోనే ఫలితాలను విడుదల అయ్యాయి. టెన్త్ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 5.64 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 85.63 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. బాలురు 84.70 శాతం, బాలికలు 86.57శాతం ఉత్తీర్ణత సాధించారు.
ఇక ఫలితాల్లో వరంగల్ (95.13) ప్రథమ స్థానంలో నిలవగా, హైదరాబాద్ (76.23)చివరి స్థానానికి పడిపోయింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎనిమిది శాతం ఉత్తీర్ణత పెరిగింది. జూన్ 15నుంచి 29వరకూ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నెల 26వ తేదీలోగా ఫీజు చెల్లించాలి. 2379 పాఠశాలలు నూరు శాతం ఉత్తీర్ణత సాధించాయి.
ఫలితాలను:www.bsetelangana.org,http://results.cgg.gov.in,www.sakshi.com,www.sakshieducation.com వెబ్‌సైట్లలో చూడవచ్చు. మరోవైపు ఫెయిల్ అయిన విద్యార్థులకు మే లేదా జూన్ నెలల్లో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పదో తరగతి ఫలితాల విడుదల తరువాత పాలీసెట్ కౌన్సెలింగ్‌ను ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.