ఎల్బీ నగర్ చౌరస్తా వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
హైదరాబాద్: నగరంలోని ఎల్బీ నగర్ చౌరస్తా వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలంగాణ జేఏసీ ఇచ్చిన నిరుద్యోగుల ర్యాలీలో పాల్గొనడానికి వస్తున్న నాయకులను పోలీసులు అరెస్ట్ చేస్తున్న క్రమంలో ఓ ఎస్సైకి గాయాలయ్యాయి. జేఏసీ ర్యాలీకి మద్దతుగా టీఎస్‌ఎఫ్(తెలంగాణ స్టూడెంట్ ఫెడరేషన్) నాయకులు ఆందోళన చేస్తుండగా.. పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వారిన డీసీఎం వాహనంలో అక్కడి నుంచి తరలిస్తుండగా.. ఒక్కసారిగా తోపులాట జరిగింది. ఈ గందరగోళంలో ఎల్బీ నగర్ ఎస్సై నరేందర్ డీసీఎం పై నుంచి కిందపడ్డారు. దీంతో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి.