- కేఆర్‌ఎంబీ సభ్య కార్యదర్శికి మంత్రి హరీశ్ ప్రతిపాదన
- సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై మంత్రి సమీక్ష
సాక్షి, హైదరాబాద్ : పోతిరెడ్డిపాడు, శ్రీశైలం, నాగార్జునసాగర్ తదితర కీలక ప్రదేశాల్లో నీటి విడుదలకు సంబంధించి తెలంగాణ, ఏపీ సం యుక్తంగా పర్యవేక్షించే వెసులుబాటు ఉండాలని నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు ప్రతి పాదించారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల పురోగతిపై శనివారం సచివాలయంలో సమీక్ష నిర్వహిం చారు. ఈ సందర్భంగా కృష్ణానదీ యాజ మాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) సభ్య కార్యదర్శి సమీర్ ఛటర్జీతో ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలపై చర్చించారు. కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టుల వద్ద టెలిమెట్రిక్ పరికరాలు ఏర్పాటు చేసే వరకు ఉమ్మడి రాష్ట్రాల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని మంత్రి స్పష్టం చేశారు.
నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీటి విడుదలపై సాగర్ ఆయకట్టు పరిధిలోని ఎమ్మెల్యేలతో ఆదివారం నల్లగొండలో సమావేశం జరుగుతుందన్నారు. ఎత్తిపోతల పథకాల నిర్వహణకుగాను ఇప్పటికే ఖాళీగా ఉన్న 31 పోస్టులతోపాటు కొత్తగా మంజూరైన 143 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల పోస్టులను టీఎస్‌పీఎస్పీ ద్వారా భర్తీ చేయాలన్నారు.
నేడు నల్లగొండలో సమావేశం
ఆదిలాబాద్ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పనులను వచ్చే ఏడాది ఖరీఫ్ నాటికి పూర్తి చేసి ఆయకట్టుకు నీరు అందించాలని హరీశ్‌రావు గడువు నిర్దేశించారు. రీ ఇంజనీరింగ్‌లో భాగంగా చేపడుతున్న కాళేశ్వరం, తమ్మిడిహెట్టి, తుపాకులగూడెంతోపాటు దేవాదుల, మిడ్‌మానరు, చనాఖా కొరాటా, లోయర్ పెన్‌గంగ, ఆదిలాబాద్ జిల్లాలోని మధ్య తరహా ప్రాజెక్టుల పురోగతిపై చర్చించారు. తమ్మిడిహెట్టి, తుపాకుల గూడెం బ్యారేజీ పనులను అక్టోబర్‌లో ప్రారంభించాలని, చనాఖా కొరాటా బ్యారేజీ, లోయ ర్ పెన్‌గంగ కాలువల నిర్మాణాన్ని 2018 కల్లా పూర్తి చేయాలని హరీశ్ సూచించారు. సమావేశంలో నీటిపారుదల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎస్‌కే జోషి, ఈఎన్‌సీలు మురళీధర్‌రావు, విజయప్రకాశ్, చీఫ్ ఇంజనీర్లు ఎన్.వెంకటేశ్వర్లు, భగవంతరావు, సునీల్, అనిల్, బి.వెంకటేశ్వర్లు, సుధాకర్, ఓఎస్‌డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే పాల్గొన్నారు.
నీటి విడుదలపై ఉమ్మడి పర్యవేక్షణ
Published Sun, Aug 21 2016 12:31 AM | Last Updated on Fri, Oct 19 2018 7:22 PM
Advertisement
Advertisement