
పొంగుతోంది.. పాతాళగంగ!
రాష్ట్రంలో భూగర్భ జలాల మట్టం గతేడాదితో పోల్చితే కాస్త మెరుగుపడింది.
20 మీటర్ల కంటే ఎక్కువ లోతులో నీటి మట్టాలున్న మండలాలు 60 ఉన్నట్లు ఆ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. గతేడాది జూన్‌లో రాష్ట్రంలో సగటున 15.03 మీటర్ల లోతులో నీరు లభ్యమవగా... ప్రస్తుతం 11.27 మీటర్ల లోతులో భూగర్భ జలాలున్నాయి. అతి తక్కువ లోతులో జగిత్యాల జిల్లా (7.33 మీటర్లు), ఎక్కువ లోతులో సంగారెడ్డి (17.03 మీటర్లు) జిల్లాలో నీటి లభ్యత ఉంది. ప్రస్తుతం నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో సగటు కంటే ఎక్కువ లోతులో నీరున్నట్లు అధికారులు చెబుతున్నారు. జోగులాంబ గద్వాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, వరంగల్ ఆర్బన్, ఖమ్మం జిల్లాల్లో సగటున 8 మీటర్ల కంటే తక్కువ లోతులో భూగర్భ జలం లభ్యమవుతోంది.