ఎస్సీలకు 75, ఎస్టీలకు 6, బీసీలకు 12 శాతం
సాక్షి, హైదరాబాద్: కొత్త ఎస్సీ గురుకుల పాఠశాలల్లో రిజర్వేషన్ల విధానాన్ని అధికారులు ఖరారు చేశారు. ఎస్సీ విద్యార్థిని, విద్యార్థులకు 75 శాతం రిజర్వేషన్లను అమలు చేయనున్నారు. దీనికి అనుగుణంగా 2016-17 విద్యాసంవత్సరంలో ఎస్సీలకు 75 శాతం, ఎస్సీ కన్వర్టెడ్ క్రిస్టియన్లకు 2, ఎస్టీలకు 6, బీసీలకు 12, మైనారిటీలకు 3, ఓసీ/ఈబీసీలకు 2 శాతం రిజర్వేషన్లు కల్పిస్తారు. గతంలో ఎస్సీలకు 87, ఎస్టీలు 6, బీసీలు 5, ఓసీ/ఈబీసీ 2 శాతం రిజర్వేషన్లు ఉండేవి. గత ఏప్రిల్ 10న నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణులైనవారి మొద టి జాబితాను రూపొందించి ఈ నెల 18వ తేదీకల్లా అడ్మిషన్ల ప్రకియను పూర్తి చేశారు. మిగిలిపోయిన సీట్లతోపాటు ఒక్కో కొత్త స్కూలులో 5వ తరగతిలో 40 మంది చొప్పున విద్యార్థుల భర్తీకి సంబంధించి ఈ రిజర్వేషన్ల విధానాన్ని అమలు చేస్తారు. కొత్త గురుకులాల ప్రవేశాలకు సంబంధించి ఈ నెల 29న బాలురకు, 30న బాలికలకు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కౌన్సెలింగ్ ఉంటుందని ఎస్సీ గురుకులాల కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు.
కౌన్సెలింగ్ కేంద్రాల వివరాలు...
ఆదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్(బాలురు), బోథ్(బాలికలు), కరీంనగర్ జిల్లాలో సీవోఈ కరీంనగర్(బాలురు), చింతకుంట(బాలికలు), ఖమ్మం జిల్లాలోని పాల్వంచ(బాలురు), ఖమ్మం జూనియర్ కాలేజీ(బాలికలు), వరంగల్‌లోని ఘన్‌పూర్(బాలురు), మడికొండ (బాలికలు), మహబూబ్‌నగర్‌లోని జేపీనగర్(బాలురు), రామిరెడిగూడెం (బాలికలు), రంగారెడ్డి,హైదరాబాద్‌ల పరిధిలోని చిలుకూరు(బాలురు), నార్సింగి (బాలికలు), మెదక్‌లోని హత్నూరా జూనియర్‌కాలేజీ(బాలురు), చిత్కుల్(బాలికలు), నల్లగొం డలోని భువనగిరి(బాలురు), జీవీ గూడెం (బాలికలు), నిజామాబాద్ జిల్లాలోని భిక్కనూరు(బాలురు), ధర్మారం(బాలికలు).
కొత్త గురుకులాల్లో రిజర్వేషన్లు ఖరారు
Published Wed, Jun 22 2016 2:29 AM | Last Updated on Sat, Sep 15 2018 3:07 PM
Advertisement
Advertisement