ఏకపక్షంగా వ్యవహరించొద్దు | The unilateral decision on the survey | Sakshi
Sakshi News home page

ఏకపక్షంగా వ్యవహరించొద్దు

Published Fri, Aug 25 2017 3:14 AM | Last Updated on Sun, Sep 17 2017 5:55 PM

ఏకపక్షంగా వ్యవహరించొద్దు

ఏకపక్షంగా వ్యవహరించొద్దు

సీపీఎం నేత తమ్మినేని
సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర భూసర్వేకు సిద్ధమవడం మంచి పరిణామమేనని సీపీఎం పేర్కొంది. అయితే రాష్ట్రంలో వందల, వేల ఎకరాలు కబ్జాకు గురవుతుంటే పట్టించుకోకపో వటం శోచనీయమని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వ్యాఖ్యానించారు. గురువారం ఎంబీ భవన్‌లో ఎమ్మెల్యే సున్నం రాజయ్య, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, బి.వెంకట్‌తో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు.

భూ సర్వేపై ఆర్భాటపు ప్రకటనలు చేయకుండా విధి విధానాలు రూపొందించాలని తమ్మినేని సూచించారు.  సర్వేపై ఏకపక్షంగా నిర్ణ యాలు చేయకుండా విపక్షాలను విశ్వాసం లోకి తీసుకోవాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయ సేకరణ సంద ర్భంగా రైతులపై టీఆర్‌ఎస్‌ కార్యకర్తల దాడులు, అణచివేత సరికాదని అన్నారు. కృష్ణా నీటిని కర్ణాటక ఏకపక్షంగా విని యోగించుకోవడంపై ఇరు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, చంద్రబాబు స్పందిం చాలని జూలకంటి డిమాండ్‌ చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement