జల్సాలకు అలవాటుపడి చోరీలకు పాల్పడుతున్న రవి అనే వ్యక్తిని నగర పోలీసులు శుక్రవారం మాదన్నపేట సమీపంలో అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ : జల్సాలకు అలవాటుపడి చోరీలకు పాల్పడుతున్న రవి అనే వ్యక్తిని నగర పోలీసులు శుక్రవారం మాదన్నపేట సమీపంలో అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి 17.5 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని మాదన్నపేట పోలీస్ స్టేషన్కి తరలించారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మాదన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో రవి పలు దొంగతనాలు చేసినట్లు పోలీసులు తెలిపారు.