ర్యాలీపై వెనక్కి తగ్గేదిలేదు: టీజేఏసీ | TJAC march for jobs on 22nd only, says kodandaram | Sakshi
Sakshi News home page

ర్యాలీపై వెనక్కి తగ్గేదిలేదు: టీజేఏసీ

Published Tue, Feb 21 2017 1:05 PM | Last Updated on Sun, Apr 7 2019 3:47 PM

ర్యాలీపై వెనక్కి తగ్గేదిలేదు: టీజేఏసీ - Sakshi

ర్యాలీపై వెనక్కి తగ్గేదిలేదు: టీజేఏసీ

హైదరాబాద్: తెలంగాణ జేఏసీ కన్వినర్ ప్రొఫెసర్ కోదండరాం నివాసంలో టీజేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశమైంది. శుక్రవారం శివరాత్రి కారణంగా ఆదివారం నిర్వహించలేమని టీజేఏసీ స్టీరింగ్ కమిటీ అభిప్రాయపడుతోంది. ఏదో రకంగా రేపే (బుధవారం) సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్క్‌ వరకు నిరుద్యోగ ర్యాలీ నిర్వహించాలనే పట్టుదలతో టీజేఏసీ ముందుకు సాగుతోంది. హైకోర్టుకు తమ అభిప్రాయాన్ని తెలియజేయనున్నారు. ర్యాలీకి అనుమతి ఇవ్వకపోతే పిటిషన్ ఉపసంహరించుకునే యోచనలో ఉన్నట్లు టీజేఏసీ పేర్కొంది.

అంతకుముందు టీజేఏసీ తలపెట్టిన నిరుద్యోగ ర్యాలీకి షరతులతో కూడిన అనుమతి ఇచ్చేందుకు హైకోర్టు సిద్ధమైంది. బుధవారం(22న) కాకుండా ఆదివారం(26న) నిర్వహించుకోవాలని ఉన్నత న్యాయస్థానం సూచించింది. అయితే ర్యాలీకి ఇప్పటికే ఏ‍ర్పాట్లు పూర్తి చేసుకున్నామని హైకోర్టుకు జేఏసీ తెలిపింది. శాంతియుత ర్యాలీ ఏర్పాట్ల వివరాల గురించి న్యాయస్థానం అడిగింది. తదుపరి విచారణను మధ్యాహ్నం 3.30 గంటల వరకు వాయిదా వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement