‘నాపై ఉ‍న్న అన్ని కేసుల్లో కేసీఆర్‌ ఉన్నారు’ | we will do march for jobs tommorow with peacefully: kodandaram | Sakshi
Sakshi News home page

‘నాపై ఉ‍న్న అన్ని కేసుల్లో కేసీఆర్‌ ఉన్నారు’

Published Tue, Feb 21 2017 5:22 PM | Last Updated on Sun, Apr 7 2019 3:47 PM

‘నాపై ఉ‍న్న అన్ని కేసుల్లో కేసీఆర్‌ ఉన్నారు’ - Sakshi

‘నాపై ఉ‍న్న అన్ని కేసుల్లో కేసీఆర్‌ ఉన్నారు’

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వంపై తెలంగాణ జేఏసీ కన్వీనర్‌ కోదండరాం నిప్పులు చెరిగారు. ఎవరిని అవమానిస్తున్నారో అనే విషయం కూడా తెలంగాణ ప్రభుత్వం విస్మరించిందని అన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా నిరుద్యోగుల ర్యాలీ నిర్వహించాలని అనుకుంటే అడుగడుగునా ఆంక్షలుపెట్టి అప్పుడే సమైక్యపాలనను తలపించే వాతావరణం సృష్టించారని అన్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్రనే నేర చరిత్రగా, హింసాత్మక చరిత్రగా పోలీసులు అభివర్ణించడం దారుణమైన అంశమని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం నిరుద్యోగ నిరసన ర్యాలీకి తెలంగాణ జేఏసీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

అయితే, ర్యాలీ విషయంలో అనుమతి నిరాకరించిన పోలీసులు సభ ప్రతిపాదన తెచ్చారు. అయితే, ఆ సభ కూడా నిర్వహించేందుకు అనువుగాని ఆరు ప్రదేశాల్లో జరుపుకునేందుకు అవకాశం ఇచ్చారు. దీనిపై మంగళవారం హైకోర్టులో జరిగిన విచారణలో నాగోల్‌ మెట్రో గ్రౌండ్‌లో సభ నిర్వహించుకునేందుకు అనుమతిచ్చింది. అయితే, ఏమాత్రం అనువుగాని ప్రాంతంలో సభకు అనుమతిచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేసి టీ జేఏసీ తన పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో జేఏసీ నేతలతో సమావేశం నిర్వహించిన కన్వీనర్‌ కోదండరాం అనంతరం మీడియాతోమాట్లాడారు. అవేమిటో ఆయన మాటల్లోనే చూస్తే..


Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement