ఉద్యోగులను వేధిస్తే సహించేది లేదు | TNGO union state executive meeting was held | Sakshi
Sakshi News home page

ఉద్యోగులను వేధిస్తే సహించేది లేదు

Published Thu, Jun 8 2017 12:28 AM | Last Updated on Thu, Sep 6 2018 3:01 PM

TNGO union state executive meeting was held

టీఎన్‌జీవో సంఘం
 
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో తప్పు చేసిన ప్రభుత్వ ఉద్యోగులపై చర్యలు చేపడితే సహకరిస్తామని, అయితే అకారణంగా ఉద్యోగులను వేధిస్తే మాత్రం సహించేది లేదని తెలంగాణ నాన్‌ గెజిటెడ్‌ అధికారుల కేంద్ర (టీఎన్‌జీవో) సంఘం పేర్కొంది. బుధవారం ఇక్కడ టీఎన్‌జీవో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన కార్యవర్గానికి నియామక పత్రాలు అందజేశారు. ఉద్యోగుల సమస్యలపై సమావేశంలో పలు తీర్మానాలు ఆమోదించారు.

అనంతరం సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రవీందర్‌రెడ్డి, రాజేందర్‌ మాట్లాడారు. ప్రభుత్వం వెంటనే ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, ఏపీలోని తెలంగాణ ఉద్యోగులను వెనక్కి తీసుకురావా లని కోరారు.  అనంతరం సంఘం గౌరవాధ్యక్షుడు దేవీప్రసాద్‌తో కలసి కొత్త కార్యవర్గ సభ్యులు సీఎం కేసీఆర్‌ను, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిని, మంత్రి హరీశ్‌రావును కలిశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement