శ్రీరామనవమి సందర్భంగా వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
భద్రాచలంలో సీతారాముల కల్యాణం
భద్రాచలంలో సీతారాముల కల్యాణ మహోత్సవం మిథిలా స్టేడియంలో ఉదయం 10.30 గంటల నుంచి 12:30 గంటల వరకు జరుగుతుంది. సుమారు 3 లక్షల మంది భక్తులు కల్యాణ మహోత్సవాన్ని తిలకిస్తారని అంచనా వేసిన అధికారులు ఈ మేరకు ఏర్పాట్లు చేశారు.
ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు
నేటి నుంచి ఒంటిమిట్టలో కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు. ఉదయం 8:30 గంటలకు ధ్వజారోహణం. శ్రీరామనవమి సందర్భంగా ఒంటిమిట్ట రామాలయంలో ప్రత్యేక కార్యక్రమాలు. సాయంత్రం 4 గంటలకు పోతన జయంతి, కమి సమ్మేళనం. రాత్రి శేషవాహనంపై ఊరేగనున్న స్వామివారు.
రామతీర్థంలో ఉత్సవాలు
విజయనగరం: రామతీర్థంలో శ్రీరామనవమి ఉత్సవాలకు సింహాచలం దేవస్థానం నుంచి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు. సీతారాములకు పట్టువస్త్రాలు సమర్పించనున్న మంత్రి మాణిక్యాలరావు.
వైఎస్ జగన్ శుభాకాంక్షలు
తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. భద్రాద్రి, ఒంటిమిట్ట సహా అన్ని గ్రామాల్లో శ్రీరామనవమి పర్వదినం వైభవంగా జరుపుకోవాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.
భద్రతా మండలి సమావేశం
సిరియాలో జరిగిన రసాయనదాడి ఘటనపై నేడు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశం కానుంది.
జీఎస్టీపై చర్చ
న్యూఢిల్లీ: రాజ్యసభలో నేడు జీఎస్టీ బిల్లుపై చర్చించనున్నారు.
ఐపీఎల్ సందడి షురూ
హైదరాబాద్: ఇవాళ్టి నుంచి ఐపీఎల్-10 సీజన్ ప్రారంభం. తొలిమ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు. రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం.