- ఢిల్లీ : నేటి నుంచి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు
రెండ్రోజులపాటూ జరగనున్న సమావేశాలు, హాజరుకానున్న మోదీ..అమిత్ షా, రాష్ట్రాల అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు
- హైదరాబాద్ : ఆర్టీసీ అదనపు దోపిడీ
దసరా ప్రత్యేక బస్సులపై 50శాతం ఎక్కువగా వసూలు
200కిలో మీటర్లు దాటితే అదనపు వసూలు
- విజయవాడ : నేటి నుంచి పారామెడికల్ డిగ్రీ కోర్సులకు దరఖాస్తులు
- విశాఖ : బంగాలఖాతంలో కొనసాగుతున్న ద్రోణి, ఆవర్తనాలు
నాలుగు రోజులపాటూ ఏపీలో విస్తారంగా వర్షాలు : వాతావరణ కేంద్రం
- విజయవాడ : ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు
అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు
దుర్గమ్మ దర్శనానికి బారులు తీరిన భక్తులు
- తిరుమల : తిరుమలలో వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు
ఉ.9గంటలకు చినశేష వాహనం, రాత్రి 9 గంటలకు హంసవాహన సేవ
- శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద
ఇన్‌ఫ్లో లక్షా 83వేలు, ఔట్ ఫ్లో 56 వేల క్యూసెక్కులు
- పంజాబ్ : మోహాలీలో సీనియర్ జర్నలిస్ట్ దారుణ హత్య
సీనియర్ జర్నలిస్ట్ కేజే సింగ్(64)ను గొంతుకోసి, ఆయన తల్లిని గొంతు నులిమి చంపిన దుండగులు
- టెహ్రాన్ : అమెరికాను ధిక్కరించి క్షిపణి పరీక్ష
మిస్సైల్ పరీక్ష విజయవంతమైనట్లు ఇరాన్ వెల్లడి
- బీజింగ్ : ఉత్తర కొరియాకు చైనా షాక్
చమురు ఉత్పత్తుల ఎగుమతిపై పరిమితులు
వస్త్ర దిగుమతులను పూర్తిగా నిలిపివేసిన చైనా
- ఇండోర్ : నేడు భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే
మధ్యాహ్నం 1:20 గంటలకు మ్యాచ్ ప్రారంభం
ఇప్పటికే సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో ఉన్న భారత్