నేటి నుంచి ఒంటిపూట బడి | today onwards half day school | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఒంటిపూట బడి

Published Sat, Mar 15 2014 1:06 AM | Last Updated on Fri, Jul 26 2019 6:25 PM

నేటి నుంచి ఒంటిపూట బడి - Sakshi

నేటి నుంచి ఒంటిపూట బడి

 సాక్షి, సిటీబ్యూరో : పాఠశాల విద్యాశాఖ ఆదేశాల మేరకు శనివారం నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు హైదరాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి ఎ.సుబ్బారెడ్డి శుక్రవారం ‘సాక్షి’కి తెలిపారు. హైదరాబాద్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలు ఇకపై ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మాత్రమే నడుస్తాయని ఆయన పేర్కొన్నారు. షిఫ్ట్ పద్ధతిన నడుస్తున్న ప్రభుత్వ పాఠశాలల వేళ ల్లో మాత్రం ఎటువంటి మార్పు లేదన్నారు. విద్యాశాఖ ఆదేశాలను ఉల్లంఘించినట్లైతే ఆయా పాఠశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు చేపడతామని డీఈవో హెచ్చరించారు. ఏప్రిల్ 24 నుంచి అన్ని పాఠశాలలకు వేసవి సెలవులు ఉంటాయని ఆయన పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement