
నేడు వైఎస్సార్ సీపీ ఆవిర్భావదినోత్సవం
సిటీబ్యూరో: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో నేడు ఘనంగా నిర్వహించాలని పార్టీ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిశీలకులు గట్టు శ్రీకాంత్ రెడ్డి, కె. శివకుమార్‌లు తెలిపారు. బుధవారం రాత్రి వారు సాక్షితో మాట్లాడారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఐదవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా గురువారం ఉదయం 8 గంటలకు లోటస్ పాండ్‌లోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరిస్తారన్నారు. ఇందులో ముఖ్యనాయకులందరూ పాల్గొనాలని చెప్పారు. అనంతరం గ్రేటర్ పరిధిలోని అన్ని డివిజన్లలో, రంగారెడ్డి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించాలన్నారు.