
కలాం మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖుల సంతాపం
హైదరాబాద్ : మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మృతిపట్ల తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నటులు, దర్శకులు సంతాపం ప్రకటించారు. ఆయన లోటును భర్తీ చేయడం ఎవరి వల్ల కాదని, టాలీవుడ్ సెలబ్రిటీలు పలువురు కలాం సేవల్ని కొనియాడారు. కొందరు ప్రముఖుల అభిప్రాయాలు వారి మాటల్లోనే..
- మీరు మా కంటిచూపుకి మాత్రమే దూరమ్యారు.. కలల్ని సాకారం చేసుకునే ప్రతి ఒక్కరి హృదయాల్లో ఎప్పటికీ చిరస్మరణీయులు : సినీ దర్శకుడు : కె.రాఘవేంద్రరావు
- మీరు జాతికి అంతటికి మార్గదర్శకులు, మీకెంతో రుణపడి ఉంటాం: దర్శకుడు రాజమౌళి
- శాస్త్రీయ పరిశోధన వైతాళికుడు అబ్దుల్ కలాం : మహేశ్బాబు
- మానవత్వానికి రోల్ మోడల్ అబ్దుల్ కలాం: 'మా' అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్
- దేశం ఒక నేతను, గొప్ప సైంటిస్ట్ ను కోల్పోయింది.. మనం ఆయన అడుగు జాడల్లో నడవాలి: జూ.ఎన్టీఆర్
- కలాం స్థానాన్ని ఎవరూ భర్తీచేయలేరు: అల్లరి నరేష్
- కలాం గారికి నేను ఏకలవ్య శిష్యుణ్ని : నారా రోహిత్
- ప్రపంచంలో భారతదేశానికి ఖ్యాతి తెచ్చిన వ్యక్తి కలాం : మంచు మోహన్ బాబు
- కలాం మృతి... దేశానికి తీరని లోటు : నందమూరి బాలకృష్ణ
- కలాం.. ఓ స్ఫూర్తిదాయక నాయకుడు : రామ్ చరణ్