సచివాలయం ఎదుట ఉద్రిక్తత | tpcc dharna at secretariat in hyderabad | Sakshi
Sakshi News home page

సచివాలయం ఎదుట ఉద్రిక్తత

Published Thu, Nov 10 2016 12:16 PM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

సచివాలయం ఎదుట ఉద్రిక్తత - Sakshi

సచివాలయం ఎదుట ఉద్రిక్తత

హైదరాబాద్: సచివాలయాన్ని కూల్చొద్దని డిమాండ్ చేస్తూ.. టీపీసీసీ ఆధ్వర్యంలో చేపట్టిన సెక్రటేరియేట్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీనియర్ నాయకులు షబ్బీర్‌అలీ, దానం నాగేందర్‌తో పాటు పలువురు నేతలు గురువారం ఉదయం సెక్రటేరియేట్ ముట్టడికి యత్నించారు.

పోలీసులు వారిని అడ్డుకోవడానికి యత్నించడంతో.. ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. సచివాలయం గేటు ముందు బైఠాయించిన నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement