రంగారెడ్డిలో 2 స్థానాలు టీఆర్ఎస్ కైవసం
హైదరాబాద్: తెలంగాణలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లాలో టీఆర్ఎస్ అభ్యర్థుల హవా కొనసాగింది. తెలంగాణ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లాలో రెండు స్థానాల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. జిల్లాలోని ఓ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి 257 ఓట్ల తేడాతో గెలుపొందారు.
జిల్లాలోని మరో ఎమ్మెల్సీ స్థానాన్ని రెండో ప్రాధాన్యత ఓట్ల ద్వారా టీఆర్ఎస్ అభ్యర్థి శంబీపూర్ రాజు కైవసం చేసుకున్నారు. పోలైన ఓట్లలో 13 చెల్లనివి ఉన్నట్లు అధికారులు తెలిపారు. రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కింపులో శంబీపూర్ రాజు విజయం సాధించారు.