సోనియా భిక్షతోనే అధికారంలో టీఆర్‌ఎస్
మాజీ విప్ తూర్పు జయప్రకాశ్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: సోనియాగాంధీ, కాంగ్రెస్ పెట్టిన భిక్ష కారణంగానే కేసీఆర్ ముఖ్యమంత్రి, హరీశ్‌రావు మంత్రి పదవుల్లో ఉన్నారని మాజీ విప్ తూర్పు జయప్రకాశ్‌రెడ్డి (జగ్గారెడ్డి) అన్నారు. తెలంగాణ రాకుంటే హరీశ్‌రావు పరిస్థితి ఎలా ఉండేదో ఆలోచించుకోవాలని గాంధీభవన్‌లో శనివారం సూచించారు.
ఫైళ్లు పట్టుకుని పైరవీల కోసం మంత్రుల చుట్టు తిరిగిన విషయాన్ని హరీశ్‌రావు గుర్తుంచుకోవాలన్నారు. ఇచ్చిన హామీలను అమలుచేయకుండా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పేరుతో టీఆర్‌ఎస్ అవినీతికి తేరలేపిందని ఆరోపించారు. ఢిల్లీలోనే ఉన్న సీఎం కేసీఆర్ కనీసం సోనియాకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పకపోవడం దారుణమన్నారు.