ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ముఠా కట్టారు
కాంగ్రెస్, టీడీపీలపై మండిపడిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేపడు తున్న సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకునేం దుకు కాంగ్రెస్, టీడీపీ నేతలు ముఠాగా తయారై కుట్రలు పన్నుతున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి దొంగల ముఠాగా మారి మీటింగ్ పెట్టారని, ఒకచోట చేరిన వీరంతా ప్రభుత్వంపై అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమె త్తారు. సోమవారం టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాల యంలో ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, గువ్వల బాలరాజు, శ్రీనివాస్‌గౌడ్, కూసు కుంట్ల ప్రభాకర్‌రెడ్డి విలేకరులతో మాట్లా డారు.
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై డీకే అరుణ ఏర్పాటు చేసిన రౌండ్‌టేబుల్ సమావేశంపై ఎమ్మెల్యేలు విరుచుకుపడ్డారు. పొరుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టుల కోసం అన్ని పార్టీలు ఒక్కటైతే.. ఇక్కడ మాత్రం ప్రాజెక్టులు వద్దన్నట్టుగా వీరు ప్రవర్తిస్తు న్నారని వెంకటేశ్వర్‌రెడ్డి దుయ్యబట్టారు. ఈ ప్రాజెక్టులో రూ.వెయ్యి కోట్లు దుబారా జరి గిందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ ప్రచారం చేస్తున్నారని, కానీ రూ.13కోట్లు ఆదా అవుతోందన్నారు. ఆయకట్టు పెరిగితే రిజ ర్వాయర్ల సామర్థ్యం పెరుగుతుందని, దాని వల్ల ప్రాజెక్టు వ్యయం పెరిగిందని, మంత్రి హరీశ్‌రావు కృషితో పాలమూరు జిల్లాలో లక్షల ఎకరాలకు నీళ్లు వస్తున్నాయన్నారు.
హరీశ్‌పై నోరు పారేసుకుంటే ఖబడ్దార్..
‘కష్టపడే మంత్రి హరీశ్‌రావును అనకూ డని మాటలంటావా నాగం. నీ కంటే ఎక్కువ మాట్లాడగలం ఖబడ్దార్. నీ హయాంలో కల్వకుర్తి కింద ఒక్క ఎకరాకైనా నీళ్లు ఇచ్చావా..? పాలమూరుకు నీళ్లిచ్చిన దేవుడు సీఎం కేసీఆర్. ఆయన హయాంలో కష్టపడి పనిచేస్తున్న మంత్రి హరీశ్‌రావు..’అని ఎమ్మెల్యే బాలరాజు పేర్కొన్నారు. ఇదే రకమైన భాష కొనసాగిస్తే, పాలమూరు రైతాంగం తిరగబడుతుందని, జిల్లాలో తిరగలేవని నాగంను హెచ్చరించారు. అసెంబ్లీ సమావేశాల్లో అన్నీ మాట్లాడదాం సిద్ధమై రావాలని కాంగ్రెస్, టీడీపీలకు హితవు పలికారు. మహబూబ్‌నగర్ ఎడారి కావాలన్నదే ప్రాజెక్టులు అడ్డుకుంటున్న వారి తపన అని, ఎన్ని అవాంతరాలు ఎదురైనా పాలమూరు–రంగారెడ్డి ప్రాజె క్టు ఆగదని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలమూరును దత్తత తీసుకుని పారిపోయాడని, ఎలాంటి దత్తతా తీసుకోకుండానే కేసీఆర్ మహ బూబ్‌నగర్‌ను పచ్చగా చేశారని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.
9న టీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీ
కేసీఆర్ అధ్యక్షతన సమావేశం
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 10 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్ శాసనసభాపక్షం భేటీ కానుంది. టీఆర్‌ఎస్ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్ష తన 9న మధ్యాహ్నం 3 గంటలకు సమా వేశం ప్రారంభమవనుంది. సమావేశానికి తప్పక హాజరు కావాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆహ్వానం పంపారు. ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొనాల్సిందిగా పార్టీ ఎంపీలను ఆహ్వానించారు.