హోదా సంగతి బాబు చూసుకుంటారు | Union Minister Prakash Javadekar Comments on CM Chandrababu | Sakshi
Sakshi News home page

హోదా సంగతి బాబు చూసుకుంటారు

Published Mon, Aug 15 2016 1:51 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

హోదా సంగతి బాబు చూసుకుంటారు - Sakshi

హోదా సంగతి బాబు చూసుకుంటారు

కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్
భవానీపురం(విజయవాడ)/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా గురించి ఏపీ సీఎం చంద్రబాబు చూసుకుంటారని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంపీ సీఎం రమేశ్‌లతో కలసి ఆయన ఆదివారం విజయవాడలోని పున్నమిఘాట్‌కు వచ్చి స్నానాలు చేశారు. ఈ సందర్భం గా జవదేకర్ మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు ఆహ్వానం మేరకు కృష్ణా పుష్కరాలకు వచ్చానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా గురించి ఒక విలేకరి అడగగా దాని గురించి మాట్లాడటానికి ఇది సమయం కాద ని, అయినా దాని సంగతి సీఎం చంద్రబాబు చూసుకుంటారని జవాబు దాటవేశారు.
 
జాతీయ సంస్థలకు నిధులివ్వండి
రాష్ట్రంలో ఏర్పాటుచేసిన జాతీయ విద్యాసంస్థలు పూర్తి స్థాయిలో పనిచేయడానికి  నిధులను సమకూర్చాలని సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను కోరారు. ఈమేరకు ఆదివారం మధ్యాహ్నం విజయవాడలోని తన కార్యాలయంలో  జవదేకర్‌కు సీఎం విన్నవించారు. ఈ సందర్భంగా జవదేకర్ మాట్లాడుతూ ఏపీలోని అన్ని విద్యాసంస్థలకు తగిన నిధులు అందిస్తామన్నారు. విద్యాసంస్థల్లో పరిశోధనలకు పరిశ్రమలు నిధులు సమకూర్చాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement