Union Minister Prakash Javadekar
-
రైల్వే ఉద్యోగులకు బోనస్ బొనాంజా
సాక్షి, న్యూఢిల్లీ: రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనాన్ని బోనస్‌గా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ బుధవారం నిర్ణయం తీసుకుంది. తద్వారా 11 లక్షల మంది ఉద్యోగులకు దసరా, దీపావళి సందర్బంగా ముందస్తు తీపి కబురు అందించింది. రైల్వే సిబ్బందికి బోనస్ అందించడం వరుసగా ఇది ఆరవ సంవత్సరం అని కేబినెట్ సమావేశం అనంతరం విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రకటించారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వానికి రూ . 2024 కోట్ల వ్యయం అవుతుందన్నారు. మీడియా సమావేశంలో కేంద్రమంత్రులు ప్రకాశ్ జవదేకర్, నిర్మలా సీతారామన్ -
కేంద్రీయ స్కూళ్ల భూసేకరణ నిబంధనలు సడలింపు
కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రీయ విద్యాలయ స్కూళ్ల ఏర్పాటుకు భూసేకరణ నిబంధ నలను కేంద్రం సడలించిందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. పలు నగరాల్లో కేంద్రీయ విద్యాలయాల స్కూళ్ల నిర్మాణాని కి అవసరమైన భూమి లభించకపోవడంతో నిబంధనలను సడలించాల్సిన ఆవశ్యకత ఏర్పడిందన్నారు. మెట్రో నగరాలలో కేంద్రీ య స్కూళ్ల నిర్మాణానికి ప్రస్తుతం అవసర మున్న 4 ఎకరాల భూమిని రెండున్నర ఎకరాలకు, గ్రామీణ ప్రాంతాల్లో 10 ఎక రాల నిబంధనను 5 ఎకరాలకు, పట్టణాల్లో 8 ఎకరాల నిబంధనను 5 ఎకరాలకు తగ్గిం చినట్లు మంత్రి తెలిపారు. ఢిల్లీలో గురు వారం కేంద్రీయ విద్యాలయ స్కూల్‌కు శంఖుస్థాపన చేసిన తర్వాత ఆయన మాట్లా డుతూ కేంద్రీయ స్కూళ్లలో అడ్మిషన్ ప్రక్రి య కోసం ఈ ఏడాది నుంచి ఆన్లైన్ వ్యవ స్థ ఏర్పాటుచేసినట్లు చెప్పారు. కేంద్రీయ స్కూళ్లలో 6 వేలకు పైగా టీచర్లను నియ మించే ప్రక్రియను కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ప్రారంభించిందని తెలిపారు. -
హోదా సంగతి బాబు చూసుకుంటారు
కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ భవానీపురం(విజయవాడ)/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా గురించి ఏపీ సీఎం చంద్రబాబు చూసుకుంటారని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంపీ సీఎం రమేశ్‌లతో కలసి ఆయన ఆదివారం విజయవాడలోని పున్నమిఘాట్‌కు వచ్చి స్నానాలు చేశారు. ఈ సందర్భం గా జవదేకర్ మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు ఆహ్వానం మేరకు కృష్ణా పుష్కరాలకు వచ్చానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా గురించి ఒక విలేకరి అడగగా దాని గురించి మాట్లాడటానికి ఇది సమయం కాద ని, అయినా దాని సంగతి సీఎం చంద్రబాబు చూసుకుంటారని జవాబు దాటవేశారు. జాతీయ సంస్థలకు నిధులివ్వండి రాష్ట్రంలో ఏర్పాటుచేసిన జాతీయ విద్యాసంస్థలు పూర్తి స్థాయిలో పనిచేయడానికి నిధులను సమకూర్చాలని సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను కోరారు. ఈమేరకు ఆదివారం మధ్యాహ్నం విజయవాడలోని తన కార్యాలయంలో జవదేకర్‌కు సీఎం విన్నవించారు. ఈ సందర్భంగా జవదేకర్ మాట్లాడుతూ ఏపీలోని అన్ని విద్యాసంస్థలకు తగిన నిధులు అందిస్తామన్నారు. విద్యాసంస్థల్లో పరిశోధనలకు పరిశ్రమలు నిధులు సమకూర్చాలన్నారు. -
విద్యా విధానం.. ముసాయిదానే!
ఆమోదించక ముందే విమర్శలా? * అందరి అభిప్రాయాలతోనే తుది రూపు * సరైన దిశలోనే రాష్ట్ర విద్యారంగం * కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ సాక్షి, హైదరాబాద్: నూతన జాతీయ విద్యా విధానంపై ప్రకటించిన ముసాయిదాను కేంద్రం ఇంకా ఆమోదించలేదని, ఇది కేవలం వివిధ వర్గాల నుంచి సేకరించిన సలహాలు, సూచనల సంకలనం మాత్రమేనని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ స్పష్టం చేశారు. ఇంకా ఆమోదించని విధానా న్ని ప్రతిపక్షాలు విమర్శించడం తగదని పేర్కొన్నారు. నూతన విద్యా విధానంపై విస్తృత చర్చ కోసమే ముసాయిదాను బహిర్గతపరిచామని చెప్పారు. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే నూతన విధ్యా విధానానికి తుదిరూపు ఇస్తామన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 29, 30 కల్పిస్తున్న మైనారిటీ విద్యా సంస్థల స్థాపన,నిర్వహణ హక్కులను కేంద్రం హరించబోతోందన్న ఆరోపణలు వాస్తవం కాదన్నారు. నూతన విద్యా విధానంపై సెప్టెంబర్ 15 వరకు సలహాలు, సూచనలు స్వీకరిస్తామని తెలిపారు. నూతన విద్యా విధానంపై రాష్ట్రాల అభిప్రాయ సేకరణలో భాగంగా శనివారం హైదరాబాద్‌లోని ఓ హోటల్లో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరితో చర్చించారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఐఐఎం ఏర్పాటు చేయాలని కడియం కోరారని, ఈ విషయాన్ని ప్రధాని మోదీ పరిశీలిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలోని ఆదర్శ, కస్తూర్బా గాంధీ, సంక్షేమ వసతి గృహాల పాఠశాలల విజయాలు సంతృప్తికరంగా ఉన్నాయని పేర్కొన్నారు. విద్యారంగం పరంగా రాష్ట్రం సరైన దిశలో వెళుతోందని ప్రశంసించారు. రాష్ట్రానికి ఐదు వరాలివ్వండి: కడియం ప్రతి రాష్ట్రంలో ఓ ఐఐఎం ఉండాలని కేంద్రం విధానమని, రాష్ట్రానికి కూడా ఐఐఎం మంజూరు చేయాలని ప్రకాశ్ జవదేకర్‌ను కోరినట్లు కడియం తెలిపారు. దీన్ని 2017-18 విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించాలని పేర్కొన్నారు. ‘బేటీ బచావో బేటీ పడావో’ నినాదాన్ని ప్రధాని మోదీ ప్రకటించగానే బాలికల కోసం కేంద్రం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టబోతోందని ఆశించామని చెప్పారు. అయితే ఇప్పటివరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు లేవన్నారు. దేశ వ్యాప్తంగా బాలికల కోసం జిల్లాకో ప్రత్యేక విద్యా సంస్థ ఏర్పాటు చేసి 1వ తరగతి నుంచి పీజీ వరకు విద్యను అందించాలని ప్రతిపాదించామని, దీనిపై పరిశీలన జరుపుతామని జవదేకర్ ఇచ్చారని తెలిపారు. కేంద్రం సహకారంతో దేశవ్యాప్తంగా మధ్నాహ్న భోజన పథకాన్ని 1 నుంచి 8వ తరగతుల విద్యార్థులకే అందిస్తున్నరని, ఇకపై 12వ తరగతి విద్యార్థులకు కూడా వర్తింపచేసేందుకు కేంద్ర సహకరించాలని కోరినట్లు వివరించారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 6 నుంచి 10వ తరగతి వరకు మాత్రమే బోధిస్తున్నారని, ఆ తర్వాత సమీపంలో జూనియర్ కాలేజీలు లేక విద్యార్థినులు చదువు మానేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యకు పరిష్కారంగా కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో 12వ తరగతి వరకు విద్యను అందించాలని ప్రతిపాదించినట్లు చెప్పారు. సరైన శిక్షణ లేకనే.. దేశ వ్యాప్తంగా విద్యా ప్రమాణాలు పడిపోవడానికి కారణం ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు సరైన శిక్షణ లేకపోవడమేనని, ఉపాధ్యాయుల శిక్షణకు అవసరమైన నిధులు, సదుపాయాలను కేంద్రం కల్పించాలని కోరినట్లు కడియం వివరించారు. ఈ ఐదు ప్రతిపాదనల పట్ల కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. కేంద్ర సంస్థలైన ఎన్సీఈఆర్టీ, ఏఐసీటీఈ, ఎన్సీటీఈలు ఇష్టారాజ్యంగా ఇంజనీరింగ్, బీఈడీ, డీఈడీ కాలేజీలను మంజూరు చేస్తున్నాయని, రాష్ట్రాల అవసరాల మేరకే కొత్త విద్యా సంస్థలను మంజూరు చేసేలా ఈ సంస్థల పనితీరుపై సమీక్ష నిర్వహిస్తామని జవదేకర్ హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. -
’చక్కటి భారత నిర్మాతలు మీరే’
పుణె: భావి భారత నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకం అని కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. దేశ అవసరాలకు తగినట్లు విద్యా విధానంలో మార్పులు తీసుకురావాలన్నా ఉపాధ్యాయులే ముఖ్యం అని చెప్పారు. అందుకే ఇకనుంచి టీచర్లు జవాబుదారులుగా ఉండే విద్యావిధానం తీసుకొస్తామని ఆయన చెప్పారు. హెచ్చార్డీ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న ఆయన తొలిసారి ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. పుణెలోని ఫెర్గుసన్ కాలేజీలో ఉపాధ్యాయులను సత్కరిస్తూ ఆయన పలు అంశాలు స్పృషించారు. ’విద్యా విధానంలో ఎన్నో ఫిర్యాదులు, సవాళ్లు, సమస్యలు ఉన్నాయి. నాణ్యమైన విద్యను అందించేందుకు మనమంతా కలిసికట్టుగా ముందుకు వెళ్లాలి. విద్యా విధానంలో మార్పులకు ఉపాధ్యాయులే కీలక పాత్ర పోషించాలి. ప్రతికూల దోరణిని విడిచిపెట్టి సానూకూలంగా పనిచేయాలి. జవాబుదారి తనంతో పనిచేసే ఉపాధ్యాయులకు కచ్చితంగా గౌరవించాల్సిన అవసరం ఉంది. ఆ పని మేం చేస్తాం’ అని ఆయన చెప్పారు.